Husnabad: మాలల రోస్టర్ పాయింట్ సవరించాలి.. పొన్నంకు మాల జేఏసీ వినతి!
Husnabad: ఎస్సీ వర్గీకరణలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించి, ప్రతి 10 పాయింట్లకు ఒక రోస్టర్ అవకాశం ఇవ్వాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాల జేఏసీ వినతిపత్రం అందజేసింది.
Husnabad: మాలల రోస్టర్ పాయింట్ సవరించాలి.. పొన్నంకు మాల జేఏసీ వినతి!
Husnabad: మాల ,మాల ఉపకులాలకు రోస్టర్ పాయింట్ వల్ల జరుగుతున్న అన్యాలను సవరించాలని రాష్ట్ర వర్గీకరణ ఉప సంఘం సభ్యులు, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి సిద్దిపేట జిల్లా మాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా ఎస్సీ కులాలను గ్రూపులుగా వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందన్నారు.గ్రూపులుగా చేసిన పద్ధతిలో ఎంపెరికల్ డేటా అమలు చేయలేదు.. ఎంపరికల్ డాటా అమలు చేయకుండా రోస్టర్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడంతో రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 3 మాల, మాల ఉపకులాల విద్యార్థి, ఉద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందనీ మంత్రికి తెలిపారు.
రోస్టర్ పాయింట్ సవరణ 22 నుంచి పది లోపు ఒక రోస్టర్ పాయింట్ ఇవ్వాలని, దీని ద్వారా విద్యా ,ఉద్యోగ అవకాశాలలో మాల, మాల ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనీ అందుకు ప్రభుత్వం రోస్టర్ సవరణ చేసి పదిలోపు ఇవ్వాలని. ప్రతి 10 పాయింట్లకు ఒక రోస్టర్ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర రవాణామంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఎస్సీ వర్గీకరణ ఉపసంఘం సభ్యులుగా ఉన్న తమరు మాలలు జరుగుతున్న అన్యాయాన్ని చర్చించి మా మాలలకు సమచిత స్థానాన్ని ఇవ్వాలని మాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆస లక్ష్మణ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ సభ్యులు ఆస బాబు, పార్థసారథి, బిక్షపతి, పల్లెటూరు ప్రసాద్ , పాల శంకర్ , రామక్రిష్ణ, పత్రి యాదగిరి, నర్సింగరావు, వెన్నరాజు , అరె కిషోర్, దండ్రు సుమన్ , సుంకే రమేష్, జాల శ్రీనివాస్, ద్యాగల సతీష్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




