Siddipet: సిద్దిపేట చిరుతపులి సంచారంతో కలకలం, భయాందోళనలో ప్రజలు!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం. పాదముద్రలను గుర్తించి అప్రమత్తమైన గ్రామస్తులు, అధికారులు.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 Sept 2026 9:35 AM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట చిరుతపులి సంచారంతో కలకలం, భయాందోళనలో ప్రజలు!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాం తంలో చిరుతపులి సంచరిస్తు న్నట్లు ఆనవాళ్లు కనిపించడంతో గొడుగుపల్లి, మహ్మదాపూర్, కోనాపూర్, తిరుమలాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్త మయ్యారు. చిరుతపులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీం తో ఫారెస్ట్ సెక్షన్స్ ఆఫీసర్ కరీముద్దీన్స్ ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ చిరుత సంచారంపై గ్రామ స్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత సాధారణంగా ఒకే ప్రాంతంలో ఉండదని, ఎక్కడైనా చిరుత కనిపించినా దాని వెంటపడటం, దగ్గరకు వెళ్లడం చేయవద్దని చెప్పారు. పరిశీలించిన వారిలో బీట్ ఆఫీసర్ జహంగీర్, గ్రామస్తులు ఉన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK