Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.74.46 లక్షలు నమోదు!
Komuravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపులో 71 రోజులకు గాను రూ.74.46 లక్షల ఆదాయం సమకూరింది.
Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.74.46 లక్షలు నమోదు!
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. గత 71 రోజులలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ.74 లక్షల 46 వేల నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 44 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీల ద్వారా లభించినట్లు తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. శ్రీకాంత్ రావు, వి. విజయ రామారావు, పి. విజయలక్ష్మి, బుద్ధి శ్రీనివాస్, ఏఈఓ, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, యు. చంద్రశేఖర్ పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




