Siddipet: కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా గణపతి ఉత్సవాలు!

Siddipet: సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు. వైభవంగా త్రిశూల స్నానం, రుద్రాభిషేక పూజలు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 23 Sept 2026 1:52 PM IST
Siddipet
X

Siddipet: కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా గణపతి ఉత్సవాలు!

Siddipet: సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్నటువంటి మహాగణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం క్షేత్రపాలక పూజ శ్రీ మల్లికార్జున స్వామి వారి ప్రాతఃకాల పూజ అనంతరం మహాగణపతి స్వామివారి సన్నిధిలో గణపతి పూజ గౌరీ పూజ దీప పూజ, జగద్గురు పంచాచార్య, నవగ్రహ ,దిక్పాలక, ప్రధాన కలశ, మరియు మహాగణపతి స్వామి వారికి షోడశోపచార చేసి ఉత్తర పూజ నిర్వహించి స్వామివారికి కూష్మాండ బలిహరణ చేసి పల్లకిలో సశాస్త్రీయంగా వైదిక విధానంలో ఆలయ అర్చకులు.

ఆగమ పాఠశాల విద్యార్థులందరూ కలిసి వేద ఘోష చేస్తూ, భజన చేస్తూ మేళ తాళాలతో ఒగ్గు పూజారుల డమరుక ధ్వనులతో ఊరేగింపుగా పుర వీధుల గుండా స్వామి వారిని ఊరేగిస్తూ శ్రీ స్వామివారి పుష్కరిణి కోనేరులో గంగా పూజ నిర్వహించి త్రిశూల స్నాన నిమర్జనం కంకన విసర్జన జరిగింది.

అనంతరం స్వామి వారి పుష్కరిణి కోనేరు నుండి వెండి కుంభంలో జలాన్ని తీసుకెళ్లి గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించి స్వామివారికి మహానీరాజన మహా మంత్రం పుష్ప సమర్పణ చేసి భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది ఒగ్గు పూజారులు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL