Vamshidhar Rao: ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు 53వ జన్మదిన వేడుకలు!

Vamshidhar Rao: బీఆర్ఎస్ నేత, కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు 53వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రక్తదాన శిబిరం, అన్నదానం, ఆస్పత్రిలో పండ్ల పంపిణీ చేపట్టారు.

RAJU, SIDDIPET
Published on: 27 Oct 2026 5:08 PM IST
Vamshidhar Rao
X

Vamshidhar Rao: ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు 53వ జన్మదిన వేడుకలు!

Vamshidhar Rao: కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు 53వ జన్మదిన వేడుకలు పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్ లో సోమవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న కోడూరు, నారాయణరావుపేట, మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ నేతలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను, బ్రెడ్ ను పంపిణీ చేశారు. కె.వి.ఆర్ సేన సభ్యులు పట్టణంలోని అనేక కూడళ్ల వద్ద అన్నదానం నిర్వహించారు. కొండ భూదేవి గార్డెన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కల్వకుంట్ల వంశీధర్ రావు అభిమానులు రక్తదానం చేశారు. వంశీధర్ రావు సైతం రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి, అభిమానులు ఆయనను గజమాలతో, ఖడ్గంతో, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనేక సామాజిక సేవ కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్ష ప్యాడ్స్, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ, విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తానని అన్నారు. ఇంతమంది అభిమానాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల కన్నారావు, మరియు కెవిఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET