Husnabad: సెట్విన్ కేంద్రంలో జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ ప్రారంభం!

Husnabad: హుస్నాబాద్ సెట్విన్‌ కేంద్రంలో జూట్ బ్యాగుల తయారీపై నూతన శిక్షణ బ్యాచ్‌ను కేడం లింగమూర్తి ప్రారంభించారు.

SRINIVAS, HUSNABAD
Published on: 23 Nov 2026 5:49 PM IST
Husnabad
X

Husnabad: సెట్విన్ కేంద్రంలో జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ ప్రారంభం!

Husnabad: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, జూట్‌ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి హానికరమని, ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందని పేర్కొన్నారు.

హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా సమీపంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో ఉన్న సెట్విన్‌ శిక్షణ కేంద్రంలో సోమవారం జూట్‌ బ్యాగుల తయారీపై నూతన శిక్షణ బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ.. జూట్‌ సంచుల తయారీలో శిక్షణ పొందడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు.

నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెట్విన్‌ హుస్నాబాద్‌ ఇన్‌ఛార్జి మహమ్మద్‌ కరీముద్దీన్‌,‌ సెట్విన్ సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD