Jagdevpur: రాముని బండ ఆలయంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Jagdevpur: కార్తీక పౌర్ణమి సందర్భంగా జగదేవ్‌పూర్ రాముని బండ సీతారాముల ఆలయంలో బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Osman Pathan, GAJEWL
Published on: 24 Nov 2026 8:19 PM IST
Jagdevpur
X

Jagdevpur: రాముని బండ ఆలయంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు

జగదేవ్‌పూర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదేవ్‌పూర్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామంలోని రాముని బండ సీతారాముల దేవస్థానాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని సీతారాములను ప్రార్థించినట్లు తెలిపారు.

కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని పేర్కొంటూ, ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును నింపాలని ఆకాంక్షించారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL