Jagdevpur: ఇటిక్యాలలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

Jagdevpur: జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం; ఆధార్, రేషన్ కార్డు, నామినీ బ్యాంకు వివరాలతో దరఖాస్తుకు పిలుపు.

Osman Pathan, GAJEWL
Published on: 24 Nov 2026 8:39 PM IST
Jagdevpur
X

Jagdevpur: ఇటిక్యాలలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

జగదేవ్‌పూర్: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభ కార్యక్రమాన్ని జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించారు. కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా సాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

ఈ పథకానికి అర్హులైన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నామినీ బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ చెరుకు లక్ష్మారెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. ఆయూబ్, బత్తిని పార్వతమ్మ, 6వ వార్డు సభ్యుడు బత్తిని ప్రవీణ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కొల్ల మల్లేష్, ఆసిఫ్, సంతోష్, కనకరాజు, వెంకట్, హరిబాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL