Cherial: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి.. సాధన జేఏసీ డిమాండ్!
Cherial: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
Cherial: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి.. సాధన జేఏసీ డిమాండ్!
Cherial: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ డిమాండ్ చేసింది.
ఈ నెల 19న సిద్దిపేటలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి మాట నిలబెట్టుకోవాలని జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య.సిపిఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బూర్గు సురేష్ గౌడ్ అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.




