Husnabad: యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి: బానోత్ అనిల్!
Husnabad: యువ వికాసం పథకాన్ని అమలు చేసి విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా సహాయంపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ నేత బానోత్ అనిల్ నాయక్ ఆదివారం డిమాండ్ చేశారు.
Husnabad: యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి: బానోత్ అనిల్!
హుస్నాబాద్: ఎన్నికల సమయంలో యువత, విద్యార్థుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షుడు బానోత్ అనిల్ నాయక్ కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన యువ వికాసం పథకం అమలుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులు కొనసాగించలేని విద్యార్థులకు ఈ సహాయం అందితే మేలు జరుగుతుందన్నారు.
అదేవిధంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకంతో పాటు, యువత విద్యా, ఉపాధి అవసరాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని పేర్కొన్నారు.
యువ వికాసం పథకం అమలు ఎప్పుడు ప్రారంభిస్తారు..? అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి అందిస్తారు..? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పందించి, యువతకు ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బానోత్ అనిల్ నాయక్ తన ప్రకటనలో పేర్కొన్నారు.




