Husnabad: హుస్నాబాద్ 11వ వార్డులో కోతుల పట్టివేత మున్సిపల్ చర్యలు
Husnabad: హుస్నాబాద్ 11వ వార్డులో కోతుల బెడద నివారణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక పట్టివేత కార్యక్రమం చేపట్టారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి పరిశీలించారు.
Husnabad: హుస్నాబాద్ 11వ వార్డులో కోతుల పట్టివేత మున్సిపల్ చర్యలు
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని 11వ వార్డులో ప్రభుత్వ పాఠశాల, కళాశాలతో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద నివారణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.శుక్రవారం మున్సిపల్ ఆధ్వర్యంలో కోతులను పట్టించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, 11వ వార్డు కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు, విద్యార్థులకు కోతుల వల్ల ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు, విద్యాసంస్థల్లో విద్యార్థుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంపత్ నాయక్, కోఆప్షన్ సభ్యురాలు సరోజన, మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ బాల్ ఎల్లం, రవికుమార్, 11వ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




