Husnabad: అమరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
Husnabad: హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్లో దివంగత కాంగ్రెస్ నాయకుడు అమరేందర్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Husnabad: అమరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తడిసిన అమరేందర్ రెడ్డి నివాసానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు.
ఈ సందర్భంగా అమరేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను, పార్టీ కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
అమరేందర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులకు అన్ని విధాలా తోడుగా నిలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.




