Husnabad: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad: హుస్నాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువు వద్ద గ్లాస్ బ్రిడ్జి పనులను తనిఖీ చేసిన మంత్రి.

CH SRINIVAS, HUSNABAD
Published on: 22 Sept 2026 7:35 PM IST
Husnabad
X

Husnabad: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్: స్థానిక ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రేపు జరగనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. మంత్రి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని అధికారులకు సూచించారు.

భద్రత లైటింగ్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు చర్యలు తీసుకునేలా ఆదేశించారు. ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీ కరణ పనులతో పాటు, చెరువులో ఏర్పాటు చేస్తున్న గ్లాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.

పట్టణంలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ , ఆర్డిఓ రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD