Husnabad: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
Husnabad: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై సురక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Husnabad: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
హుస్నాబాద్: ప్రపంచ మధుమే హం దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో సురక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాన్ని ఎల్లమ్మ చెరువు కట్టపై నిర్వహించినట్లు ఎం ఎం డి గ్రూప్ సభ్యులు తెలిపారు. ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో డాక్టర్ ఎల్ ధర్మా, పాల్గొని ఎం ఎం డి గ్రూప్ సభ్యులకు హెల్త్ చెకప్ చేశారు.
బిపి, షుగర్ టెస్ట్, వంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండిలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారిపద్మ, కౌన్సిలర్స్ వైద్యం కిరణ్ కుమార్, ఎం ఎం డి గ్రూప్ సభ్యులు, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




