Husnabad: కరెంట్‌ కోతలతో వరి పంటలు ఎండుతున్నాయి: మల్లికార్జున్ రెడ్డి

Husnabad: హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో కరెంట్ కోతలతో ఎండిపోతున్న వరి పొలాలను బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి పరిశీలించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 8 Oct 2026 6:19 PM IST
Husnabad
X

Husnabad: కరెంట్‌ కోతలతో వరి పంటలు ఎండుతున్నాయి: మల్లికార్జున్ రెడ్డి

హుస్నాబాద్‌: వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. గురువారం హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామంలో కరెంట్‌ కోతలతో నీరందక ఎండుతున్న వరి పొలాలను బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటకు నీరందించేందుకు బావుల్లో నీరు ఉన్నా, విద్యుత్‌ కోతల కారణంగా పొలాలకు నీరు పారించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.

ఎన్నికల సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ప్రస్తుతం వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ అందడం లేదని విమర్శించారు. విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచకుంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఆలుమల్ల నర్సింహారెడ్డి, అయిలేని గాల్‌రెడ్డి, బత్తుల కొమురయ్య, గవ్వ హనుమంతరెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD