Husnabad: మార్కెట్ యార్డులోనే పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేయాలి

Husnabad: హుస్నాబాద్ మార్కెట్ యార్డులోనే పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు జరపాలని, రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత డిమాండ్ చేశారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 16 Nov 2026 9:23 PM IST
Husnabad
X

Husnabad: మార్కెట్ యార్డులోనే పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేయాలి

హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లను మార్కెట్ యార్డులోనే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో వేలం పాట విధానంలో కొనుగోళ్లు చేపట్టాల్సిన రిటైల్ లైసెన్సుదారులు తమ ఇళ్ల వద్ద, అద్దెకు తీసుకున్న షెడ్లలో ఇష్టానుసారంగా కొనుగోళ్లు జరుపుతున్నా మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మార్కెట్ యార్డులో పోటీ విధానంలో కొనుగోళ్లు నిర్వహిస్తే రైతులకు మద్దతు ధర కంటే మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. తూనికల కొలతల శాఖ అధికారులు సీజన్ ప్రారంభానికి ముందే ఎలక్ట్రానిక్ కాంటాలను తనిఖీ చేయాలని కోరారు. మట్టి, సంచి బరువు, నగదు కట్టింగ్ పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని, కొందరు లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే రైతులకు అన్యాయం జరుగుతుండటం విచారకరమన్నారు. వెంటనే మార్కెట్ కార్యదర్శి స్పందించి మార్కెట్ యార్డులోనే కొనుగోళ్లు జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలుపుల రాజు, డేగల వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD