Husnabad: కనీస వేతనం అమలు చేయాలి

Husnabad: హుస్నాబాద్‌లో ఆశా కార్యకర్తల నిరసన. ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం అమలు చేయాలని, డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిక.

CH SRINIVAS, HUSNABAD
Published on: 12 Nov 2026 7:32 PM IST
Husnabad
X

Husnabad: కనీస వేతనం అమలు చేయాలి

హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా తమ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు.

ఏఎంసీ లక్ష్యాల విషయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిసెంబర్ 15లోగా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD