Dubbak: ‘మన పోలీస్ - మన ఊరు’లో హబ్సిపూర్ పాఠశాల సుందరీకరణ

Dubbak: ‘మన పోలీస్ - మన ఊరు’ కింద దుబ్బాక హబ్సిపూర్ ప్రభుత్వ పాఠశాలను పోలీసులు సుందరీకరించారు. సీపీ రష్మీ పెరుమాళ్ విద్యార్థులకు ప్లేట్లు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 12 Nov 2026 7:46 PM IST
Dubbak
X

Dubbak: ‘మన పోలీస్ - మన ఊరు’లో హబ్సిపూర్ పాఠశాల సుందరీకరణ

Dubbak: ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని హబ్సిపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణను దుబ్బాక పోలీసులు సుందరంగా తీర్చిదిద్దారు.

ఇటీవల దుబ్బాక పట్టణ పర్యటనకు విచ్చేసిన పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ హబ్సిపూర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా, విద్యార్థులకు అనువుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తించారు.

సీపీ గారి ఆదేశాల మేరకు, ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల ప్రవేశ ద్వారపు బోర్డుకు మరియు ప్రహరీ గోడలకు కొత్తగా రంగులు వేయించారు. దీనివల్ల పాఠశాల ఆవరణ ఎంతో ఆకర్షణీయంగా, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా రూపుదిద్దుకుంది.

ఈ సందర్భంగా గురువారం సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గారు పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను, ప్లాస్టిక్ రీసైకిల్డ్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థుల సూచించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK