Husnabad: హుస్నాబాద్‌లో వైభవంగా ఏనె మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం!
Husnabad: కార్తీక పౌర్ణమి సందర్భంగా హుస్నాబాద్‌లో మేకల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏనె మల్లన్న స్వామి కల్యాణోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
Husnabad: హుస్నాబాద్‌లో వైభవంగా ఏనె మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం!
హుస్నాబాద్: కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంకకల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మల్లన్న స్వామి కళ్యాణ వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించగా, భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాస ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణోత్సవం వైభవంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో యాదవ, కురుమ సంఘాల నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




