Husnabad: వచ్చే సీజన్‌కు గౌరవెల్లి నీళ్లు అందిస్తాం: పొన్నం
Husnabad: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు, 136 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, క్రీడా కోర్టుల కేటాయింపు వివరాలను వెల్లడించారు.
Husnabad: వచ్చే సీజన్‌కు గౌరవెల్లి నీళ్లు అందిస్తాం: పొన్నం
హుస్నాబాద్: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో గౌరవెల్లి ప్రాజెక్టులోకి ఈ సారి నీళ్లు తీసుకురాలేక పోతున్నా మన్నారు.
వచ్చే సీజన్ నాటికి గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు తీసుకువచ్చి, కాలువల ద్వారా నీళ్లు అందించి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా మనీ, గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.
గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టులు అన్నదమ్ముల లాంటివి, గండిపల్లి ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసి వినియోగంలోకి తెస్తా మనీ, హుస్నాబాద్ నియోజకవర్గంలో నీటి అంశానికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. అర్హతను బట్టి లబ్ధిదారుల్లో కాంగ్రెస్ వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉండచ్చు, దాన్ని రాజకీయం చెయ్యద్దు.
దీపావళి మరుసటి రోజు నుండి నియోజకవర్గంలో 136 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తా మనీ, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అలింకో క్యాంపును ఈ నెలలో నిర్వహించి దివ్యాంగులందరికీ ఉచితంగా పరికరాలను అందిస్తున్నామని తెలిపారు.
వర్షపాతం ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటిస్తుంది, దానికి నేనేదో, ఎవరో చెప్తే ఇవ్వరు.
అన్ని రంగాల్లో హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తామని, దీపావళి కానుకగా కబడ్డీ, వాలీబాల్, కోకో కోర్టులను హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాలను ఏర్పాటు చేస్తున్నా మనీ, నియోజకవరంలోని 30 పెద్ద గ్రామాలకు 2 లక్షలు, చిన్న గ్రామాలకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేస్తున్న గ్రామాలలో నీటి సరఫరాతో పాటు ఏ సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు తన దృష్టికి తీసురావాలన్నారు.




