Siddipet: దుబ్బాక సరస్వతి స్కూల్‌లో గాయత్రి పూజలు.. ప్రారంభమైన విద్యా సంవత్సరం!
Siddipet: దుబ్బాక సరస్వతి గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా గాయత్రి పూజలు.
Siddipet: దుబ్బాక సరస్వతి స్కూల్‌లో గాయత్రి పూజలు.. ప్రారంభమైన విద్యా సంవత్సరం!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన విద్య అకాడమీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో గాయత్రి దేవి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమ్మవారి పూజ మహోత్సవంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. చిన్నారులు గాయత్రి దేవి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గాయత్రి మంత్రాలు చదవడం శుభ పరిణామం అన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి సంవత్సరం పాఠశాలలో గాయత్రి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్లోబల్ స్కూల్ చైర్మన్ నారాయణ, ప్రధానోపాధ్యాయుడు వెంకటరెడ్డి తెలిపారు.
ఈ సంవత్సరం కూడా ఉత్తమ విద్యా బోధనతో విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం విద్యార్థులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి, కనుక రెడ్డి, బాబా, పాల్గొన్నారు.




