Siddipet: 430 గ్రాముల గంజాయి, జిక్సర్ బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Siddipet: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్. 430 గ్రాముల గంజాయి, బైక్, ఫోన్లు స్వాధీనం.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 30 Aug 2026 5:07 PM IST
Siddipet
X

Siddipet: 430 గ్రాముల గంజాయి, జిక్సర్ బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Siddipet: గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ – 430 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, 03 మొబైల్ ఫోన్లు స్వాధీనం. జగదేవ్‌పూర్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 430 గ్రాముల గంజాయి, ఒక GIXXER ద్విచక్ర వాహనం మరియు 03 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తేదీ 30-08-2026 ఉదయం 07:00 గంటలకు జగదేవ్‌పూర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జె. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జగదేవ్‌పూర్ శివారులోని గజ్వేల్ రోడ్డులో గల భారత్ పెట్రోల్ బంక్ వద్ద GIXXER ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన వారు అక్కడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారు A-1: దేవుని @ కొజ్జ నవీన్ కుమార్, వయస్సు 25 సంవత్సరాలు, మునిగడప గ్రామం, జగదేవ్‌పూర్ మండలం మరియు A-2: చీలసాగర్ పవన్ కళ్యాణ్, వయస్సు 26 సంవత్సరాలు, జగదేవ్‌పూర్ గ్రామం, ప్రస్తుతం కొంపల్లి, హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు.

వారి వద్ద ఉన్న GIXXER మోటార్ సైకిల్ నంబర్ TS-06-FF-3588ను పరిశీలించగా, సీటు కింద ప్లాస్టిక్ కవర్లలో దాచిన 430 గ్రాముల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలోని సీలేరు సరిహద్దు ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి, కొంత భాగాన్ని వినియోగించడంతో పాటు, మిగిలిన గంజాయిని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.

నిందితుల వద్ద నుండి 03 మొబైల్ ఫోన్లు, గంజాయి రవాణాకు ఉపయోగించిన GIXXER మోటార్ సైకిల్ TS-06-FF-3588 మరియు 430 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS Act ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

గంజాయిని సేవించడం, అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని జగదేవ్‌పూర్ పోలీసులు తెలిపారు. గంజాయి సేవించే లేదా గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడే వ్యక్తుల వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL

Next Story