Gajwel: గజ్వేల్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి మంత్రులకు నర్సారెడ్డి వినతి
Gajwel: గజ్వేల్ అభివృద్ధి నిధులు, రింగ్ రోడ్డు పనుల పూర్తికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలను కలిసిన కాంగ్రెస్ ఇన్‌చార్జి తూముకుంట నర్సారెడ్డి.
Gajwel: గజ్వేల్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి మంత్రులకు నర్సారెడ్డి వినతి
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలను కోరారు. మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గురువారం మంత్రులను కలిసి పలు అభివృద్ధి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాధాన్యత కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డు నిర్మాణం, రహదారుల విస్తరణ పనులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా ఖాళీగా ఉన్న వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు తూముకుంట నర్సారెడ్డి తెలిపారు.




