Gajwel: రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీలకు గజ్వేల్ విద్యార్థులు

Gajwel: గజ్వేల్ మల్లన్నసాగర్ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు జనగామలో జరిగే 70వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర సెపక్‌ తక్రా పోటీలకు ఎంపికయ్యారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 10 Nov 2026 7:38 PM IST
Gajwel
X

Gajwel: రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీలకు గజ్వేల్ విద్యార్థులు

గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీలకు ఎంపికయ్యారు.

పాఠశాలకు చెందిన జి. కావేరి, జి. శ్యాంకిషోర్, జి. రాహుల్, ఏ. భూలక్ష్మి, జి. లాస్య, మీనాక్షి ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయిలో నిర్వహించిన సెపక్‌ తక్రా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జనగామలో నిర్వహించనున్న 70వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. కరీముద్దీన్‌ తెలిపారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌. ప్రశాంత్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అభినందించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL