Gajwel: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్!
Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్. పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్.
Gajwel: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్!
Gajwel: సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, శుభ్రతకు ముందు, అనంతరం పరిసరాల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం
ఇందులో భాగంగా 14వ వార్డులోని ఐసీడీఎస్ గోడౌన్ వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, పి. గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సేవలందిస్తున్న సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి వి. లావణ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలక్ష్మి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




