Gajwel: గజ్వేల్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించి స్మరించుకున్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 26 Oct 2026 9:19 PM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు!

గజ్వేల్, సిద్దిపేట జిల్లా: మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి సురేఖ, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నత్తి శివకుమార్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సురేఖ, నత్తి శివకుమార్ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి కేవలం ఒక మహర్షి మాత్రమే కాదని, గొప్ప ఆలోచనలకు, పరివర్తనకు, స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. భారతీయ సాహిత్యంలో ఆదికవిగా మహర్షి వాల్మీకి విశిష్ట స్థానం పొందారని, ఆయన రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, ధర్మం, నైతిక విలువలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

రామాయణం కేవలం శ్రీరాముడి జీవిత కథ మాత్రమే కాదని, జీవితంలో ఎలా నడుచుకోవాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ధర్మం కోసం ఎలా నిలబడాలి, సమాజం పట్ల బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అనే ఎన్నో విలువైన అంశాలను బోధించే మహాకావ్యమని వివరించారు.

మహర్షి వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, మనిషి గతం కంటే అతనిలో వచ్చే పరివర్తన, ఆలోచనలు, ఆచరణే ముఖ్యమని ఈ సందర్భంగా చంటి ప్రభు పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మహర్షి వాల్మీకి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్య, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

పలువురు బీజేపీ నాయకుల హాజరు

ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్, నాలుగో వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్యాల వెంకటరెడ్డి, మన్నె శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వంజరి రాజు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు నాయిని సందీప్ కుమార్, ఇప్ప స్వామి, జిల్లా నాయకుడు పెండ్యాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగు ముదిరాజ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు కుంకుమ రాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుమతి, పట్టణ ఉపాధ్యక్షురాలు చెన్నోజి నీరజ, బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, సంగేపు అనిల్, అనిల్ బజరంగ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL