Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆలయాల్లో కార్తీక శోభ, భక్తుల సందడి

Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆలయాల్లో కార్తీక మాస పూజలు, అభిషేకాలు; దీపారాధన, తీర్థప్రసాదాలు, అన్నదానంతో ఆధ్యాత్మిక వాతావరణం.

Osman Pathan, GAJEWL
Published on: 24 Nov 2026 8:33 PM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆలయాల్లో కార్తీక శోభ, భక్తుల సందడి

గజ్వేల్–ప్రజ్ఞాపూర్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పట్టణాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శివాలయాలు, రామాలయాలు, ఆంజనేయస్వామి, అయ్యప్పస్వామి, సంతోషిమాత, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

మహిళలు ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి, తులసి కోట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదానం చేపట్టాయి. కార్తీక దీపాల వెలుగులు, శివనామస్మరణలతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పట్టణాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL