Gajwel: గజ్వేల్‌లో సవేరా రెస్టారెంట్ అండ్ మంది ప్రారంభం
Gajwel: గజ్వేల్-సంగాపూర్ రోడ్డులో గర్ల్స్ హబ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవేరా రెస్టారెంట్ అండ్ మందిని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్.
Gajwel: గజ్వేల్‌లో సవేరా రెస్టారెంట్ అండ్ మంది ప్రారంభం
గజ్వేల్: పట్టణంలోని గజ్వేల్–సంగాపూర్ రోడ్డులో గర్ల్స్ హబ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవేరా రెస్టారెంట్ అండ్ మందిని మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నూతన వ్యాపార సంస్థలు అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, మెరుగైన సేవలు అందించి ప్రజల ఆదరణ పొందాలని రెస్టారెంట్ నిర్వాహకులకు సూచించారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్కర్ పద్మాబాయి నర్సింగ్, వార్డు కౌన్సిలర్ మర్కంటి కనకసేన భాగ్యలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ జకీఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




