Gajwel: 'కార్మిక రత్న' కృష్ణమూర్తిని సన్మానించిన ఎంపీ రఘునందన్‌రావు

Gajwel: జాతీయ స్థాయి 'కార్మిక రత్న' అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు మరాఠీ కృష్ణమూర్తిని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సన్మానించారు.

Osman Pathan, GAJEWL
Published on: 17 Nov 2026 9:11 PM IST
Gajwel
X

Gajwel: 'కార్మిక రత్న' కృష్ణమూర్తిని సన్మానించిన ఎంపీ రఘునందన్‌రావు

గజ్వేల్: కార్మిక రంగంలో విశేష సేవలందిస్తూ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ‘కార్మిక రత్న’ జాతీయ అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు, గజ్వేల్ నియోజకవర్గ బీఎంఎస్ ఇన్‌చార్జి మరాఠీ కృష్ణమూర్తిని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. కార్మిక రంగానికి కృష్ణమూర్తి అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL