Gajwel: గజ్వేల్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సదస్సు
Gajwel: గజ్వేల్ ఐఎంఏ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ సదస్సు; రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక విధులు, సామాజిక సమరసత ఆవశ్యకతపై వక్తల ప్రసంగాలు.
Gajwel: గజ్వేల్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సదస్సు
గజ్వేల్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో బుధవారం గజ్వేల్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కాన్ఫరెన్స్ హాల్‌లో వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా హైదరాబాద్ రిటైర్డ్ ఆర్డీఓ వి. దేవేందర్ రెడ్డి, సమరసత కళా సమితి జాతీయ ఇన్‌చార్జి అప్పాల ప్రసాద్ హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, ప్రతి పౌరుడు నిర్వర్తించాల్సిన ప్రాథమిక విధులు, సమాజంలో సామాజిక సమరసత ఆవశ్యకతను వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నాగ మున్నయ్య, వైద్యులు డాక్టర్ పెంటాచారి, డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ అరవింద్, డాక్టర్ శ్రీధర్, ప్రముఖ వక్త హరిన పవన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.




