Gajwel: చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాయపడిన యువకుడికి రూ.15 వేల సాయం
Gajwel: రోడ్డు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీ కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ 91వ సేవా కార్యక్రమంలో రూ. 15 వేల ఆర్థిక సాయం.
Gajwel: చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాయపడిన యువకుడికి రూ.15 వేల సాయం
గజ్వేల్: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి చెలిమి ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 91వ సేవా కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం చిన్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన జూపల్లి వంశీ ప్రజ్ఞాపూర్‌లోని ఎలక్ట్రిక్ స్కూటీ షోరూంలో పనిచేస్తున్నాడు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు ఢీకొనడంతో తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో వంశీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
నిరుపేద కుటుంబానికి చెందిన వంశీ వైద్య ఖర్చులు భరించడం కుటుంబ సభ్యులకు భారంగా మారింది. ఈ విషయాన్ని ఫౌండేషన్ సభ్యుడు టెంటు నర్సింలు సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన సభ్యులు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు గుంటుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, సభ్యులు గుర్రం తులసీదాస్, డాక్టర్ మహేష్, కొండాపురం యాదగిరి, టెంటు నర్సింలు, జూపల్లి బాలకుమార్, పోల సంతోష్, రచ్చ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తూ చెలిమి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.




