Husnabad: ఇందిరాగాంధీ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు!

Husnabad: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

SRINIVAS, HUSNABAD
Published on: 1 Nov 2026 8:51 AM IST
Husnabad
X

Husnabad: ఇందిరాగాంధీ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు!

Husnabad: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, జాతీయ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ రక్షణ, అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని గుర్తుచేశారు. ఆమె ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే ఇందిరాగాంధీకి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు చింతల మల్లారెడ్డి, సర్పంచ్ చిన్న నాయక్, పంగ రాకేష్, బొమ్మ అభిలాష్, ముని రాజు, గంగారపు కొమురయ్య, మహేందర్, వల్లపు రాజు, సదయ్య, ఎండీ అక్బర్ బాషా, మంద మహేందర్, దేవనూరి రాజు, కాశివేణి ఎల్లయ్య, ఎలిషాని వెంకటయ్య, నక్క కొమురయ్య, నక్క బాలయ్య, అనిల్, బోయిని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD