Cheriyal: చేర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలు
Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Cheriyal: చేర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలు
చేర్యాల: చేర్యాల పట్టణంలో టపాకాయల దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి దీపావళి పండుగ నేపథ్యంలో టపాకాయల విక్రయాల కోసం ఏర్పాటు చేసిన దుకాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
టపాకాయల విక్రయదారులకు పోలీసులు ముందస్తుగా పలు సూచనలు చేసినప్పటికీ, కొందరు వ్యాపారుల తీరు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా ఒక దుకాణానికి మరొక దుకానానికి మధ్య కనీసం 15 ఫిట్ల దూరం లో దుకణాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అదేమీ పట్టనట్టుగా ఒకదానికి మరొకటి ఒకటి అనుకోని ఏర్పాటు చేశారు
టపాకాయల దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు జరిగితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి టపాకాయల దుకాణాలను నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పండుగ వేళ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




