Dubbak: రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Dubbak: చేగుంట మండలం రెడ్డిపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి, రైతులకు మద్దతు ధర అందాలని సూచించారు.
Dubbak: రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం,వ్యవసాయ రంగ అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తోందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు.
రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ధాన్యం తూకం,నాణ్యత పరిశీలన, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
వరి కోతలు పూర్తయిన వెంటనే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు.




