Toguta: రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత: చెరుకు విజయ్ రెడ్డి

Toguta: తొగుట మండలం రాంపూర్, కాన్గల్, లింగంపేట గ్రామాల్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి ప్రారంభించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 12 Nov 2026 4:28 PM IST
Toguta
X

Toguta: రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత: చెరుకు విజయ్ రెడ్డి

సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని రాంపూర్, కాన్గల్, లింగంపేట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డితో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని, రైతులకు అండగా నిలుస్తూ వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK