Cherial: విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. ఆకునూరులో రైతుల నిరసన!
Cherial: చేర్యాల మండలం ఆకునూరులో విద్యుత్ కోతల వల్ల ఎండిపోయిన వరి చేనులో ఎడ్లను మేపుతూ రైతుల నిరసన. కనీసం 15 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్.
Cherial: విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. ఆకునూరులో రైతుల నిరసన!
Cherial: రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించి ఆదుకోవాలని బాధిత రైతులు శనివారం మండలంలోని ఆకునూరు గ్రామంలో ఎండిపోయిన వరి చేనులో ఎడ్లను మేపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు కంతుల నర్సయ్య మాట్లాడుతూ తాను పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని, లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండిస్తున్న వరి పంట చేతికందే దశలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక నీళ్లు పారక పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కనీసం 15 గంటలు అయినా విద్యుత్ ను అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో రైతులు శెట్టె మల్లయ్య, సందబోయిన వెంకటేష్, పస్తం మల్లేష్, కనకయ్య, రాములు, రాజు, తదితరులు పాల్గొన్నారు.




