Husnabad: విద్యుత్ సమస్యలపై భగ్గుమన్న BRS.. ధర్నా చేపట్టిన సతీష్ కుమార్!
Husnabad: హుస్నాబాద్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా, రాస్తారోకో.
Husnabad: విద్యుత్ సమస్యలపై భగ్గుమన్న BRS.. ధర్నా చేపట్టిన సతీష్ కుమార్!
Husnabad: ప్రజా పాలన పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న డీఈ కార్యాలయం, సబ్‌స్టేషన్ ఎదుట నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించామని తెలిపారు.
రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
ప్రజా పాలన పేరుతో గొప్పలు చెప్పుకోవడం కాదు.. రైతులకు అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా అందించి వారి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని శ్రీ వొడితల సతీష్ కుమార్ గారు స్పష్టం చేశారు. ఈ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని విద్యుత్ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు.




