Maddur: మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కొమ్మూరి!
Maddur: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్‌లో మృతుల కుటుంబాలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Maddur: మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కొమ్మూరి!
సిద్దిపేట జిల్లా: మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, విద్యావేత్త ప్రతికంఠ రామ్మూర్తి ఇటీవల మృతి చెందడంతో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అదేవిధంగా అదే గ్రామానికి చెందిన చిలుక బాబు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి సైతం సంతాపం వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు దాసరి పద్మారెడ్డి, రామడుగు బాలరాజు, ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్, కార్యదర్శి భూషణమైన రాజు తదితరులు పాల్గొన్నారు.




