Siddipet: దుబ్బాకలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి.. బక్కి వెంకటయ్య నివాళి!

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య నివాళులర్పించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 28 Nov 2026 2:17 PM IST
Siddipet
X

Siddipet: దుబ్బాకలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి.. బక్కి వెంకటయ్య నివాళి!

Siddipet: మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు భారతదేశ సామాజిక చరిత్రలో చిరస్మరణీయమైన మహనీయులని పేర్కొన్నారు.

సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఆయన చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళలకు విద్య అందించాలనే సంకల్పంతో తన సతీమణి సావిత్రిబాయి ఫూలే గారితో కలిసి బాలికల విద్యకు పునాదులు వేయడం, అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో గొప్ప మార్పునకు నాంది పలికారని కొనియాడారు.

విద్య ద్వారానే సామాజిక చైతన్యం, సమానత్వం, ఆత్మగౌరవం సాధ్యమవుతాయని ఫూలే గారు చాటి చెప్పారని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి కూడా మార్గదర్శకమన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK