Dubbaka: ఇందిరమ్మ బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి!

Dubbaka: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ పరిశీలించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 28 Nov 2026 10:47 AM IST
Dubbaka
X

Dubbaka: ఇందిరమ్మ బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి!

Dubbaka: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ కోరారు. గ్రామ పంచాయతీ లో జరుగుతున్న బీమా నమోదు కార్యక్రమం ను ఆమె పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబంలోని సంపాదించే ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

ఇప్పటి వరకు కేవలం 150మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగిందని,అర్హులైన వారు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబరుతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని, బీమా పొందే వ్యక్తి తన నామినీ వివరాలను కూడా నమోదు చేయించుకోవాలని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK