Siddipet: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఘనంగా కేసీఆర్ దసరా వేడుకలు
Siddipet: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఘనంగా కేసీఆర్ దసరా వేడుకలు. వేద పండితుల సమక్షంలో వాహన, ఆయుధ పూజలు, శమీవృక్ష పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
Siddipet: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఘనంగా కేసీఆర్ దసరా వేడుకలు
ఎర్రవెల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో దసరా వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన కేసీఆర్ అనంతరం శమీవృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హిమాన్షు రావు పాల్గొన్నారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ, కోడలు శైలిమతో పాటు మాజీ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, పలువురు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ విజయదశమి శుభాలు కలగాలని ఆకాంక్షించారు.




