Dubbak: దుబ్బాకలో భిన్నంగా ఎల్ నినో (El Nino) అవగాహన కార్యక్రమం!

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక 20వ వార్డులో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల వేదికగా ఎల్ నినో (El Nino) ప్రభావంపై యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ అవగాహన కల్పించింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 Oct 2026 9:10 AM IST
Dubbak
X

Dubbak: దుబ్బాకలో భిన్నంగా ఎల్ నినో (El Nino) అవగాహన కార్యక్రమం!

Dubbak: ఓ వైపు పండుగల సందడి.. మరొకవైపు మారుతున్న ప్రకృతి వైపరీత్యాలపై ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం!

​మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించి పూజించే సాంప్రదాయాన్ని మనకు అందించారు. అదే సంస్కృతిని కొనసాగిస్తూ, ప్రస్తుత ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్న 'ఎల్ నినో' (El Niño) ఎఫెక్ట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక వినూత్న ప్రయత్నం జరిగింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక 20వ వార్డులో, యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల వేదికగా ఈ విశేష కార్యక్రమం రూపుదిద్దుకుంది.

పూల పండుగ బతుకమ్మను, వాతావరణ మార్పుల అవగాహనతో ముడిపెడుతూ దుర్గామాత మండపం ముందు ఒక భారీ డిజిటల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.​దుర్గామాత మండపం, భక్తుల సందడి.అవును.. పండుగ ఉత్సవాలు కేవలం వినోదానికే పరిమితం కాకూడదు, సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలనే మంచి సంకల్పంతో యు.కిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది.​దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షిస్తోంది.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK