Dubbaka: ఎలక్ట్రిక్ బైక్ను ఢీకొన్న డీసీఎం వ్యాను.. వృద్ధుడు మృతి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక శివారులో ఎలక్ట్రిక్ బైక్ను డీసీఎం వ్యాను ఢీకొన్న ప్రమాదంలో 80 ఏళ్ల వృద్ధుడు కొక్కిరాల నాగారావు అక్కడికక్కడే మృతి చెందాడు.
Dubbaka: ఎలక్ట్రిక్ బైక్ను ఢీకొన్న డీసీఎం వ్యాను.. వృద్ధుడు మృతి!
దుబ్బాక: అతివేగంతో, జాగ్రత్తగా వస్తున్న డీసీఎం వ్యాను ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో, వృద్ధుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులో జరిగింది.
దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీ గాధ గ్రామానికి చెందిన కొక్కిరాల నాగారావు (80) అనే వృద్ధుడు వ్యవసాయం చేస్తూ, కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో బావికి సంబంధించిన మోటారు పాడవడంతో, రిపేరు చేయించేందుకు తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై దుబ్బాకకు బయలుదేరాడు.
పట్టణ శివారులోని పాత ఎల్లమ్మ గుడి సమీపంలోకి రాగానే దుబ్బాక నుంచి పెద్దచీకోడ్ వైపు అతివేగంతో, జాగ్రత్తగా వస్తున్న డీసీఎం వ్యాను, ఎదురుగా వస్తున్న వృద్ధుడి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుని తలకు తీవ్ర గాయమై, అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, పంచనామా నిర్వహించారు.




