Dubbaka: కాంగ్రెస్ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
Dubbaka: కాంగ్రెస్ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు!
Dubbaka: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అవగాహన లేకుండా గజినీలాగా రోజుకొక మాట మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లిలో ఇందిరమ్మ ఇల్లుతోపాటు తిమ్మాపూర్ గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఐకేపి సెంటర్లు తాను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను బెదిరించడం, ఆ తర్వాత వర్షానికి ధాన్యం తడిసిపోయిందని మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉన్నాయని ఒకసారి చెప్పి, మరోసారి సిద్దిపేట జిల్లాను కరువు మండలంగా ప్రకటించాలని అనడంపై ఎమ్మెల్యేకు వ్యవసాయంపై, నీళ్లపై సరైన అవగాహన లేదని విమర్శించారు.కేవలం ప్రభుత్వంపై బురద చల్లడానికి, ప్రజలను మభ్యపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.




