Dubbaka: అత్తగారింట్లో వేధింపులు.. దుబ్బాకలో వివాహిత ఆత్మహత్య

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ కలహాలతో వివాహిత వైష్ణవి (26) ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.

Chindam Karunakar, Dubbak
Published on: 10 Nov 2026 6:52 PM IST
Dubbaka
X

Dubbaka: అత్తగారింట్లో వేధింపులు.. దుబ్బాకలో వివాహిత ఆత్మహత్య

దుబ్బాక: అత్తగారింట్లో కుటుంబ సభ్యులతో జరుగుతున్న గొడవలు, కలహాల వల్ల జీవితం మీద విరక్తి చెందిన వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చోటుచేసుకుంది.

దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం.... కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన న్యాంతాబాదు వైష్ణవి (26) కి దుబ్బాక పట్టణానికి చెందిన గజబింకార్ వినయ్ కుమార్ తో 2024 నవంబర్లో వివాహం జరిగింది.గత కొంతకాలంగా అత్తగారింట్లో వైష్ణవికి, ఆమె భర్త, కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో సోమవారం రాత్రి జీవితం మీద విరక్తి చెందిన వైష్ణవి ఇంట్లోని పడకగదిలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

జరిగిన ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak