Dubbaka: దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలి సీపీఎం!
Dubbaka: దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరవాలని తహశీల్దార్‌కు సీపీఎం వినతిపత్రం.
Dubbaka: దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలి సీపీఎం!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలనీ మరియు దుబ్బాక మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ చేస్తూ CPM పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక తహశీల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరింగింది. అనంతరం CPM పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉంటుందనీ భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల పంటలు దిగుబడి రాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం కూడా చాలా తక్కువగా కురిసినందున తెలంగాణ రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా పర్కటించిన రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా అదే తరహాలో కరువు నెలకొన్నదనీ తెలిపారు.ప్రస్తుతం రైతుల బోరుబావులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయన్నారు.




