Dubbak: అకాల వర్షంతో ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యం!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట ఐకేపీ సెంటర్లో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
Dubbak: అకాల వర్షంతో ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యం!
దుబ్బాక: ఉన్నట్టుండి ఒకేసారి వర్షం దంచి కొట్టడంతో రైతుల ఐకెపి సెంటర్లో ఆరబోసి అమ్ముకుందామన్న, వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో బోరుణ విలపిస్తున్నారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో ఐకెపి సెంటర్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి, పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుకాలం కష్టపడి పంట పండించి ఐకెపి సెంటర్లో వరి ధాన్యాన్ని పోసి అమ్ముకుందామంటే అకాల వర్షంతో ధాన్యం తడిచిపోయింది అన్నారు. ఐకెపి సెంటర్ లో ధాన్యాన్ని ఆరబోస్తే నిర్వాకులు అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కనీసం ఐకెపి సెంటర్ కూడా ప్రారంభించలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఐకెపి సెంటర్ ను ప్రారంభించి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.




