Dubbak: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా పల్లె వంశీ కృష్ణ గౌడ్ నియామకం
Dubbak: బీజేపీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధిగా పల్లె వంశీ కృష్ణ గౌడ్ నియామకం. ఎంపీ రఘునందన్ రావు సూచన మేరకు నియామకం చేపట్టిన జిల్లా అధ్యక్షులు బైరి శంకర్.
Dubbak: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా పల్లె వంశీ కృష్ణ గౌడ్ నియామకం
దుబ్బాక: సీనియర్ నాయకులు,సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన న్యాయవాది పల్లె.వంశీ కృష్ణ గౌడ్ ను జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు భైరి.శంకర్ ముదిరాజ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా బైరి శంకర్ గారు మాట్లాడుతూ, మెదక్ పార్లమెంటు సభ్యులు "మాధవనేని రఘునందన్ రావు సూచన మేరకు ఈ నియామకం జరిగిందని తెలిపారు.
పల్లె.వంశీ కృష్ణ గౌడ్ గారు గతంలో విద్యార్థి నాయకునిగా మొదలుకొని ,ఉమ్మడి మెదక్ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గా పార్టీ కి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఈ బాధ్యతను అందించడం జరిగిందని తెలిపారు, సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి, తనవంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, ప్రజా సమస్యల మీద, పార్టీ గొంతుకగా గళం వినిపించాలని కోరారు.




