Dubbak: బాధితులకు ఎల్లవేళలా అండగా ఉంటాం: దుబ్బాక ఎమ్మెల్యే భరోసా!
Dubbak: సిద్దిపేటలో చికిత్స పొందుతున్న ఉద్యమ నేత కుంబాల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నేత భైరాగౌడ్ కుమారుడిని పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి. అండగా ఉంటామని భరోసా.
Dubbak: బాధితులకు ఎల్లవేళలా అండగా ఉంటాం: దుబ్బాక ఎమ్మెల్యే భరోసా!
దుబ్బాక: సిద్దిపేట జిల్లా తొగుట మండలానికి చెందిన పలువురుని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న ఘనపూర్‌కు చెందిన ఉద్యమ నాయకుడు కుంబాల శ్రీనివాస్‌ను సిద్దిపేటలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే గుడికందులకు చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు దూలం భైరాగౌడ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెల్యే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు..ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట తొగుట మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచ్ గంగసాని రాజిరెడ్డి, నాయకులు వేల్పుల స్వామి, కంది రాంరెడ్డి, కలీమొద్దీన్, అస యాదగిరి, శ్రీనివాస్ తదితరులున్నారు.



