Dubbak: మిరుదొడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం.. హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Dubbak: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఎల్వీ ప్రసాద్ నేత్ర సంస్థ సహకారంతో కుంట కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
Dubbak: మిరుదొడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం.. హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
దుబ్బాక: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కుంట జితేందర్ రెడ్డి,విజయేందర్ రెడ్డి, సౌందర్యల జ్ఞాపకార్థం, ఎల్వీ ప్రసాద్ నేత్ర సంస్థ సహకారంతో, కుంట సుకన్య గోపాల్ రెడ్డి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన శిబిరాన్ని సందర్శించారు. సందర్భంగా శిబిర నిర్వాహకులను అభినందించారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి పేదలకు అండగా నిలవాలని తమ ఆత్మీయులు జ్ఞాపకార్థం కుంట కుటుంబ సభ్యులు ప్రజల ఆరోగ్యం పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి సేవా నిర్వహించడం ఆదర్శనీయమని ప్రశంసించారు. కుంట కుటుంబ సభ్యుల సేవాభావం అభినందనీయమని కొనియాడారు.




